STORYMIRROR

Kadambari Srinivasarao

Inspirational

4  

Kadambari Srinivasarao

Inspirational

విగ్రహవాన్ సత్యః

విగ్రహవాన్ సత్యః

1 min
2.4K

తప్పులగని నుండి జీవిత గమనాన్ని మార్చి

విలువల రత్నాలను దోసిట పట్టి 

సత్యవాక్కు జీవితకాల దీక్షగా సాగిన మహాత్ముడు


స్వచ్ఛమైన నవ్వులో సత్యాన్ని

విరబూయించడం ఆయనకే సొంతం

కొల్లాయి గుడ్డ, చేతికఱ్ఱ

నిరాడంబరతకు నిలువెత్తు సాక్ష్యాలు


రెండు కాళ్ళే తన జీవిత రథంగా

నడకలో లేడి పిల్ల చురుకుదనంతో

సత్యం,అహింసలనే సులోచనాలతో

లోకాన్ని చూసిన సౌజన్యశీలి


స్వాతంత్రోద్యమ నౌకను

పోరాట సుడిగుండాలనుండి

సురక్షితంగా ఒడ్డుకు చేర్చి

బానిసత్వపు ఉచ్చులో బిగిసిన భారతావనికి

స్వేచ్చాఊపిరిని ప్రసాదించిన జాతిపిత


పొదుపు జీవన విధానం

ఆయన ధరించిన విలువైన ఆభరణం

నేటికీ వాడ వాడలా ఎందరికో

ఆదర్శంగా నిలిచిన విగ్రహరూప సత్యం



Rate this content
Log in

Similar telugu poem from Inspirational