స్నేహమేరా శాశ్వతం.
స్నేహమేరా శాశ్వతం.


అమ్మ అనే పదం తర్వాత,
ఆత్మీయతను ధ్వనింప చేసే ఏకైక పదం స్నేహం,
స్నేహం దేవుడిచ్చిన గొప్ప వరం,
ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం,
స్నేహం మంచి అనుభూతులను తెచ్చిపెడుతుంది,
మంచి స్నేహం వ్యక్తి వికాసానికి బాటలు వేస్తుంది,
స్నేహం తోడుంటే ఓ ఆయుధం,
స్నేహం తోడు ఉంటే తెలియని ధైర్యం,
స్నేహానికి వయసుుతో సంబంధం ఉండదు,
తమ కష్టసుఖాలను ఒకరికొకరు పంచుకుంటారు,
ఇంట్లో చెప్పుకోలేని విషయాలు స్నేహితులతో తమ బాధలను చెప్పుకుంటారు,
సెల్ఫోన్ లో రోజు నాలుగు మాటలు మధురంగా మాట్లాడే వాడు స్నేహితుడు,
మనం తప్పు చేస్తే చివాట్లు పెట్టే వాడు స్నేహితుడు,
నీ కన్నీరు తుడుస్తా నేనున్నాను అని ఓదార్చే వాడు స్నేహితుడు,
మనకు అవసరమైనప్పుడు అప్పు ఇచ్చే వాడు స్నేహితుడు,
ఈ సమయాన్ని గడప మంటు సలహా ఇచ్చే వాడు స్నేహితుడు,
మనం ఏ పనైనా చేసినప్పుడు మనల్ని ప్రోత్సహించిన వాడు స్నేహితుడు,
తాను వెనక ఉండి మనల్ని ముందుకు నడిపించే వాడు స్నేహితుడు,
స్నేహం ఒక విలువైన బంధం,
అపురూపంగా కాపాడుకుందాం,
స్నేహాన్ని గౌరవిద్దాం,
స్నేహమేరా జీవితం,
స్నేహమేరా శాశ్వతం.
సూర్యుడి ఉదయం
ఐక్యతకు నవోదయం.