స్వాతంత్రం
స్వాతంత్రం
ఎవరికి స్వాతంత్రం?
ఎందుకు స్వాతంత్రం?
అందరి ఆకలి తీర్చే రైతుకా?
ఆకలి తీరాక కనిపించని వాళ్ళ ఆత్మహత్యాలకా?
ఎన్నో కలలుతో నిండిన యువతకా?
తీర్చుకోలేని కలల్ని మోస్తున్న వాళ్ళ భుజాలకా?
ఎవరికి స్వాతంత్రం ?
ఎందుకు స్వాతంత్రం?
భరతమాత ప్రతిరూపం గా భావించే ఆడవాళ్ళు కా?
మగ మృగాల వల్ల వాళ్ళ పై జరుగుతున్న అత్యాచారాలకా?
పేదరికం పేరు చెప్పి అవినీతికి చేసే నాయకులకా?
అదే పేదరికంలో ఉంటూ ఓటుకు నోటు తీసుకునే మనకా?
ఎందుకు స్వాతంత్రం?
ఎవరికి స్వాతంత్రం?