సందేశం
సందేశం
మారుతుందా మన దేశం
చేరుతుందా ఈ సందేశం
అడ్డుకున్నా ఆక్రోశం
అంటుతోంది ఆకాశం !!
గొప్ప గొప్ప గోత్రాలు
గోడమీద మూత్రాలు
ఛీపేవి మంచి సూత్రాలు
చూసేవి నీలి చిత్రాలు !!
గతి తప్పిన మనుషులు
మతి తప్పిన నేతలు
శృతి తప్పిన రాగాలు
వింత వింత రోగాలు !!
ముదురు మాటల పిల్లలు
కుదురు లేని పెద్దలు
ఎదురు లేని అన్యాయం
నిదురపోతుందా న్యాయం?
చెప్పేదొకటి చేసేదొకటి
వినేదొక్కటి చెప్పేదొక్కటి
చూసేదొకటి చేసేదొకటి
పొంతన లేని వెలుగు చీకటి !!
ప్రతి దానికి పార్టీలు
అన్నిటికి అబద్ధాలు
శాంతికి సమాధులు
అశాంతికి పునాదులు !!
ప్రశ్నపత్రం లీకులు
పేరెంట్స్ మీదే జోకులు
వాడదు యువత బ్రేకులు
సహనానికి పడ్డాయి మేకులు !!
మొహాలపై తుమ్ములా
గోడమీద ఉమ్ములా
ప్రతి వాడికి కొమ్ములా
పెద్దలనెదిరేంచే దమ్ములా !!
మితిమీరిన చేష్టలు
అతి తెలివి తేటలు
అవతలి వాడి బలహీనతలు
ఇవతలి వాడి బలాలు !!
హద్దు మీరు మాటలు
ముద్దు మీరు కడుపులు
భావితరం భయంకరం
ఉడుకుతోంది నరం నరం !!
ఎవడి డబ్బా వాడిది
ఇంకొకడి గొప్ప బూడిది
ఎవరికీ వారే హీరోలు
మిగతావారు జీరోలు !!
మానుకోండి అలవాట్లు
చెయ్యకండి పొరపాట్లు
నాగరికతకు నాగుబాట్లు
తెచ్చుకోవద్దు అగచాట్లు !!