STORYMIRROR

vani sowjanya ganteda

Inspirational

5  

vani sowjanya ganteda

Inspirational

పడతి - ప్రగతి

పడతి - ప్రగతి

1 min
35.1K


జగత్ వృద్ధికి మూలమైనది స్త్రీ మూర్తియే ఐనా

తన ప్రాముఖ్యతను గుర్తించునా సమాజం ఈనాటికైనా

అనాగరిక నిబంధనలకు తలవంచి, తన జీవనాన్ని గడుపుతున్నా

ఆమె ఆత్మాభిమానం కోరేకొంత విలువ దొరుకునా ఎనాటికైనా !


కాలగమనమున కరిగిపోయినది వనితకిచ్చిన విలువ

స్త్రీ హక్కులనే సిరాక్షరాలు తీర్చగలదా ఈ కొదవ ?               

ఆశ నిరాశల నడుమ సతమతమవుతున్న ఓ మగువ

ఈ సమాజానికి ఎదురు పడక ఏడ దాగినది నీ తెగువ !


ఈ లోకం దృష్టిలో నీవు ఒక సాదారణ మహిళవే ఐన

కాదు కాదని తెలియజెప్పు, నీ చేతలతో ఇకపైన

నీ కలల జీవన సార్థకతకై పోరాడు అలుపెరుగక

నీ సామర్థ్యాలను మెరుగుపరుచుతూ సాగిపో గమ్యం వైపుగ !


దేశ భవితకు తోడ్పడుతూ అడుగులు వేయి మునుముందుగ

నీ ఆలోచనలతో మేల్కొల్పు ఈ లోకాన్ని నీవో నాయికగ

నింగి నంటిన గుండె ధైర్యమును కూడగట్టుకొని ఓ మగువ

వెనుదిరగక ఈ సమాజానికి చూపు ఇక నీ చొరవ !


Rate this content
Log in

More telugu poem from vani sowjanya ganteda

Similar telugu poem from Inspirational