ఉగ్రవాదం
ఉగ్రవాదం
ఉగ్రవాదం వీరి నినాదం
తీవ్రవాదం వీరికి వేదం
మంచికి చెడుకి మధ్య వివాదం
మనిషికి పశువు కి లేదా భేదం !!
నీతిమాలిన మనుషుల పనికి మాలిన పనులా
మతిమాలిన మానవుల గతికాలిన చేష్టలా
బుర్రలున్న పుర్రెలా తలాడించే గొర్రెలా
సమాజానికి సవాలా ప్రతి క్షణం శవాలా !!
ప్రతి వాడ వాడాలా
ఆత్మాహుతి దాడులా
లేదా ప్రాణానికి విలువ
పడిందా న్యాయానికి శిలువ ?
మూర్ఖత్వం మూటగట్టి
కర్కశత్వం కరుడుగట్టి
మతతత్వం మంటబెట్టి
దుర్మార్గం వెన్ను తట్టి
సాధించేదేంది మట్టి !!