వెటకారం
వెటకారం


ఏమైందోయ్ సంస్కారం
ఎవరిచ్చారధికారం
పోయిందా మమకారం
వచ్చిందా వెటకారం !!
వెకిలి నవ్వుల మకిలి సం స్కృతి
ఇది బాబు నేటి పరిస్థితి
పట్టనట్టుంటే పట్టు అధోగతి
యువతరం వాడాలి బుద్ధి మతి !!
ఓర్పుకు పడ్డ మేకులా
ఒకరిమీద ఒకరి జోకులా
లేవు దీనికి బ్రేకులా
లోకులు కాదు కాకులా !!
వారు వీరు తేడా లేదా
మంచి మర్యాద రానే రాదా
అర్ధం కాదా అవతలి వాడి బాధ
మనిషి మనిషికి ఉందొ గాధ !!
నిన్ను నువ్వు మార్చుకో
గౌరవించడం నేర్చుకో
అందరిని అక్కున చేర్చుకో
బుద్ధి జ్ఞానం సమకూర్చుకో !!