STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Inspirational

5  

SATYA PAVAN GANDHAM

Inspirational

"అమ్మ వేదన"

"అమ్మ వేదన"

1 min
35.1K

బాధలను భరిస్తూ, 

భారాన్ని మోస్తూ,

బాధ్యతగా శ్రమిస్తూ..


ఈ జగతికి తన రూపు కనపడకుండా దాచిపెడుతూ,

తనకి తాను గా ఏర్పరచుకున్న ప్రపంచంలో అలుపు లేకుండా పరుగెడుతూ, 

ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న "ఓ మానవతా మూర్తి..."


తన జడల ముడుల మాటున దాగిన ఆ ఆవేశం కురులుగా విరబూస్తూ...

తను సృష్టించిన ఈ లోకాన్నే కబళించి మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేయగల శక్తి తనకున్నా,


కారాగారం లాంటి వంటిట్లో

సంతోషమనే స్వేచ్చ కి

సహనం అనే సంకెళ్లు వేసుకుని

ఓర్పుతో ఒదిగివున్న తన ఔదార్యాం.. 


ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితుల(గృహ నిర్భంధం) ద్వారా ప్రతి ఒక్కరి మదిని కదిలిస్తూ, కలచివేస్తూ తన విలువని చాటి చెప్తుంది.

 

"తల్లి తో సమానమైన ప్రతీ మహిళకు ఇది అంకితం".


Rate this content
Log in

Similar telugu poem from Inspirational