Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Ramesh Babu Kommineni

Inspirational


5.0  

Ramesh Babu Kommineni

Inspirational


వీరసైన్యం

వీరసైన్యం

1 min 466 1 min 466

ప౹౹

వీరుడా వీరుడా ప్రాణాలను త్వజించిన శూరుడా

దేశమాత సేవలో దేహాన్ని చాలించిన ఓ ధీరుడా

వందనం వందనం వందనం నీకు మా వందనం ||2||

చ||

భరతమాత ముద్దుబిడ్డగా నీ త్యాగమే అమరం

కొరతలేదు యోధులకు సాగించేందుకు సమరం ||2||

దొంగ ముష్కరులనే దొరకబట్టి నరకాలి సాంతం

అదే అసలైన నివాళిలే తీర్చిన నాడు ఆ పంతం ||ప||

చ||

వీర భూమికై రక్తతర్పణంతో నిలిచావు చరిత్రలో

అంతకు మించి ఆత్మార్పణం ఉన్నదా ధరిత్రిలో ||2||

చాటుమాటు దాడులతో చెదరిపోదే మా స్తైర్యం

అంతకు వేయింతలే పెరిగీ వెలిగేను మా ధైర్యం ||ప||

చ||

నేలకోసం నెత్తురోడ్చిన ఆ పుణ్యజన్మా పునీతం

నేలకొరిగిన వీరత్వం నెగడై నిలిచి పెంచే ఊతం ||2||

రగిలిన గుండెలే రణభూమిలో చేసాయి సవాలే

వక్రబుద్ధిని వధించటం వీరులకే అసలైన నివాళే ||ప||


Rate this content
Log in

More telugu poem from Ramesh Babu Kommineni

Similar telugu poem from Inspirational