శార్వరీ స్వాగతం
శార్వరీ స్వాగతం
గడచిన ఉగాదులన్నీ రసరమ్య రసాలలో ఓలలాడించినవె
వేద మంత్రోచ్చరణలతో పండితుల పంచాంగ శ్రవణాలతో
కవుల కవయిత్రుల కవితాగానాలతో వీనుల విందు చేసినవే
షడ్రుచుల పచ్చడులతో నోరూరించే పిండి వంటలతో
పంచభక్ష్య పరమాన్నాలతో విందు భోజనం పెట్టినవే
ఆత్మీయుల అయినవాళ్ళ ఆలింగనాలతో ఆనంద డోలికల్లో ఓలలాడించినవె
గుమికూడి గుంపుగా ఆనందాన్ని మనసుపోరల్లోకి వంపుకున్నదే
అందరోక్క చోట చేరి అల్లరి , ఆహ్లాదం ఇచ్చిపుచ్చుకున్నదే
ఏడాది దాచుకున్న మమతానుబందాల్ని కరువుతీరా మనసారా అనుభవించిందే
అదేంటో ఇప్పుడిలా ముఖం చూస్తూ భారంగా తప్పుకోవడం
ఐకమత్యంగా చేతులు కలిపి బలం నిరూపించిన చోటే
అందరూ మానసికంగా ఒకటైనా ఒక్కరొక్కరుగా విడిపోయి
ఆలింగనాల ఊసు కాదు కదా ఆమడ దూరముండే పరిస్థితి
అయినా ఆదరని బెదరని, యుద్ధానికి వెన్ను చ
ూపని ధీరత్వం
ఒంటినిండా గంధంలా పూసుకున్న వాళ్ళం
కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి
కలిసి జరుపుకునే కవిసమ్మేలనాలనే కాదు
కాలు బయట పెట్టకుండా ఉన్నదాంట్లోనే ఉగాది జరుపుకోగలం
విరిసిన వసంతాలు వేపపూతలు కోకిల కూజీతాలు
పంచాంగ శ్రవణాలు వేదం మంత్రాలు పండితుల ఆశీర్వచనాలు
లక్ష్మణ రేఖగా దిగ్బంధం చేసుకున్న ఇంటి నుండే
సర్వం సకలం అనుభవించగలం ఆస్వాదించగలం
ఇతరుల అనుభవాలనే పాఠాలు గా మల్చుకుని
భారత సంస్కృతీ సంప్రదాయాల రుచి ని మరోసారి
యావత్ ప్రపంచానికి తెలిపి శభాష్ అనిపించుకోగలం
వికారి తెచ్చిన మహమ్మారిని సంయమనం తో తిప్పి కొట్టి
శాశ్వతంగా తరిమి కొట్టే శార్వరి ని స్వాగతిద్దాం రండి
*************************