మన తెలుగు
మన తెలుగు
జిలుగు వెలుగుల పులుగు, తేట తేనియల తెలుగు
రంగారు, పొంగారు, బంగారు, సోయగాల తెలుగు
నాడు పద్య, ప్రబంధాలలో విహరింపజేసిన తెలుగు
కవి త్రయముల చేత నేడు పదునెక్కిన తేట తెలుగు
అన్నమయ్య పదకవితల ఒదిగి ఎదిగిన తెలుగు
జనపదుల నోట జాణయై సుగమమైన తెలుగు
సామెతలు, పలుకుబడులతో ఇంపైన తెలుగు
వచన కవితతో సార్వజనీనమై అలరిన తెలుగు
సాహితీ లోకంలో శుక్రతారగా వెలుగొందిన తెలుగు
కావ్యోపనిషత్తులను జనులకు సరళీకరించిన తెలుగు
అందరికీ చేరువలో ఉండి అలరించే ముగ్ధ తెలుగు
అందరినీ అమ్మలా ఆదరించే మాతృభాష మన తెలుగు