నమో శ్రీజగన్నాథ
నమో శ్రీజగన్నాథ
హే నాథ !
నమో శ్రీ జగన్నాథ !!
మీరే మా లోకనాథులు !!
మీరే మా ఆత్మబంధువు ఆపద్బాంధవులు !!
మీరే శ్రీమందిరం శ్రీ మహాలక్ష్మి దేవి ప్రాణనాథలు
మీ దయ ఉండగా మేము ఎన్నడూ కాదు అనాథులు,
మీరు మా అందరి ప్రియంకర శ్రేయాభిలాషి శ్రీనాథులు,
ప్రేమపథం ద్వారా భక్తిమార్గం ప్రసాదించటంలో సమర్థులు|౧|
మీ చక్రనయనాల కృపాదృష్టి మాపైన ఎప్పుడు చూపండి,
మీ సర్వాంగసుందర వేషాల దివ్యదర్శనం ప్రసాదించండి,
చందనయాత్ర స్నానయాత్ర రథయాత్రల దర్శనభాగ్యం కలిగించండి,
అన్ని ప్రకారమైనా ప్రాకృతిక ఆపదల నుండి రక్షణ సంరక్షణ కలిగించండి|౨|
హే నాథ !
నమో శ్రీ జగన్నాథ !!
మీరే మా లోకనాథులు !!
మీరే మా ఆత్మబంధువు ఆపద్బాంధవులు !!