STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Classics

5  

Venkata Rama Seshu Nandagiri

Classics

తొలకరి

తొలకరి

1 min
34.3K

మండుటెండలకు వేడెక్కిన

పుడమి వానకై తపియిస్తూ

తాళలేక వేడిమి తపించి పోయె

ఎండలకు తరువులు మోడువారె


పడగానే తొలకరి చినుకు 

నేలతల్లి పులకించి పోయి

తాపాన్ని చల్లార్చిన 

వరుణునికి ప్రణమిల్లె


హర్షమును చిన్నిమొలకతో ప్రకటించె

తరువులతో తలవంచి వందనమర్పించె

ప్రకృతినలంకరించె రంగురంగుల పూలతో

హరిహరు నర్చించె భక్తి భావముతో



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics