వ్యాకరణ బంధు
వ్యాకరణ బంధు
అ నుండి అంతా పరిచయం చేసే
అచ్చులు హల్లులు.. అమ్మానాన్నలు..
ఒత్తులు వరసలు.. గుణింతాలు అత్తా మామలు..
పిన్నమ్మలు.. పెద్దమ్మలు..
అండగా ఉండే అన్నలు.. అలంకారాలు..
ఉత్పకమాల, చంపకమాల ఛందస్సులు.. అక్కాచెల్లెల్లు..
ఒకరికి ఒకరం అర్ధం చెప్పే
తనూ నేను ప్రతిపదార్ధాలు..
మా ప్రతిరూపాలు, మా పిల్లలు పర్యాయపదాలు..
వాళ్ళ పిల్లలు నానార్ధాలు..
ప్రకృతి వికృతులు అక్కాబావలు..
విమర్శించే వాళ్ళు వ్యత
ిరేకపదాలు..
విద్య నేర్పే లఘువులు.. గురువులు..
ఏకవచం వదినలు..
ఎంతమందైనా ఉండచ్చు కాబట్టి బహువచనాలు
మా బావమరుదులు..
సంధులు సమాసాలు.. చుట్టాలు పక్కాలు..
విభక్తులు వీధి స్నేహితులు..
సొంతోల్లు ఎపుడూ సొంతవాక్కాయాలు .. బంధువులందరూ భాషాభాగాలు..
{తీయని తేనె లాంటి తెలుగు మీద నా అభిమానాన్ని తెలిపే చిన్న ప్రయత్నం..
బాషా వ్యాకరణానికి బంధం కలపడం నా చిలిపితనం.. నా ఆలోచనలకి కలం కదిలిన సమయం..}
మీ
ఆచారి అందరివాడు