ప్రకృతి పరవశించే వేళ
ప్రకృతి పరవశించే వేళ
ప్రియురాలుని పరవశింపజేయ మామిచిగురు తిన్న
మత్తకోయిలలు పదే పదే కూయగా
కర్ణామృతాన్ని విన్న వనమయూరాలు పురివిప్పి నయనానందకరంగా నాట్యమాడే వేళ
పరవశించిన పూబాలలు తలలుపైకెత్తి అరవిడిన
పూరేకుల నయనాలతో సుందర సుమనోహర గాన నృత్య కేళిని ఆస్వాదించే వేళ
నింగినున్న దినకర సుధాకరులు సంతషించగా కొలనులోన కమలాక్షులు పద్మాక్షులు కైమోడ్పులందించే
వేళ
శోభాయమానంగా విలసిల్లిన సుస్వర పదగతుల రంగవల్లులను తన కుంచెతో బంధించ రవివర్మకైనా
వివశుడిని చేయగా
సంగీత నాట్య విభావరిని వీంక్షించిన ప్రకృతికాంత
పురుషులు పరవశించి మురిసేవేళ……..
జ్ఞానులని విర్రవీగే అజ్ఞానులైన మదమెక్కిన
మానవమృగాలు నిర్దాక్షిణ్యంగా,
తమ మేధస్సును మధించి మలచిన, అస్త్రశస్త్రాలతో వీరవిహారంచేసి వధించిన మూగజీవాలు ,
నోరులేని ప్రకృతి మది రోదించగా కారిన కన్నీరే కాదా " కరోనా "
కారణమేదైనా ప్రపంచాన్ని కబళించింది కరుణలేని కరోనా
కంగారుతో కారణాలనెదికిన జనానికి కానరాదు కఠిన
నిజం
అవును ఇది నిజం
మనం జనం ప్రకృతి ప్రసాదించిన జీవన వేదాన్ని కాలదన్ని
అనుసరించే విశృంఖల జీవన విధానం కాదా 'కరోనా' కి
కారణం
ఇకనైనా జనులు కనులు తెరచి ప్రకృతిని పూజించి ఆస్వాదించకపోతే ముందున్నదంతా శూన్యం.........
*********