లాలి పాట
లాలి పాట
ఉయ్యాల లూగవమ్మా ............ ఉయ్యాల లూగవమ్మా
అమ్మ వడిలో అమృతమే గ్రోలి చల్లగా పవళించవే
తరుణీ మణి నా తల్లి అమృత వల్లి
ఉయ్యాల లూగవమ్మా..............ఉయ్యాల లూగవమ్మా
అమ్మమ్మ గట్టిన పట్టుపుతూయలలొ ముద్దుగా పవళించవే నా తల్లి అమృతవల్లి ఉయ్యాల లూగవమ్మా...............ఉయ్యాల లూగవమ్మా
తాతయ్య తెచ్చ్చిన మణిమాలనే ధరియించి తిరునగరిలో తారాడి అలసి సొలసిన నాయమ్మ ముద్దుగా పవళించవే నా తల్లి అమృతవల్లి ఉయ్యాల లూగవమ్మా.................ఉయ్యాల లూగవమ్మా
కౌస్తుభం ధరియించి ఆ భద్రాచాలేశుండు రామదాసుని జోలలో పవళించినట్టు ఈ శశిధరుని రాగాలలో నా గారాల సురభి సద్దుసేయక ముద్దుగా పవళించవే నా తల్లి అమృతవల్లి ఉయ్యాల లూగవమ్మా..................ఉయ్యాల లూగవమ్మా
కాళమ్మతో కూడి నీ తాతమ్మే తరలివఛ్చి నిన్నక్కున జేర్చి లాలించేవేళ బొజ్జ నిండా ఉగ్గు తాగి ముద్దుగా &
nbsp; పవళించవే నా గారాల తల్లి అమృతవల్లి
ఉయ్యాల లూగవమ్మా...................ఉయ్యాలలూగవమ్మా
నీ మామ కార్తికేయుండే వఛ్చి చందమామనే చూప పరవశించిన నాయమ్మ పవళించవే నా గారాల తల్లి అమృతవల్లి
ఉయ్యాల లూగవమ్మా..................ఉయ్యాల లూగవమ్మా
ఉయ్యాల లూగవమ్మా..................ఉయ్యాల లూగవమ్మా
********💐********