సుఖము
సుఖము


పద్యం:
మనము పొందె సుఖము మంచిదో చెడ్డదో
పరుల యేడ్పు నీకు వలదు సుఖము
కోరుకున్న సుఖము కొంచమైనాచాలు
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! మనము అనుభవించే సుఖము మంచిదో చెడ్డదో ఎవరికీ తెలియదు. ఇతరుల దుఖము వలన కలిగే సుఖము మనకు మంచిది కాదు. మనము పొందే సుఖము కొంచెమైనా అది ఇతరులను బాధ పెట్టకుండా ఉండాలి.