సాయి శరణం....శ్రీనివాస భారతి
సాయి శరణం....శ్రీనివాస భారతి


భక్తుల గొంతుల భజనల వేడుక
ఓంకారాల కీర్తన మాలిక
సాయి నీకోసం అక్షర లక్షలు
నీవిచ్చినవే శక్తియుక్తులూ
పుట్టుక లేని నీకు చేసిన
పుట్టినరోజు సంబరాలివి
దసరా పుణ్యతిధులలో మేము
మహాసమాధి కి బరువు మనసులు
స్వాంతన చిక్కని జీవితాలకు
మార్గం చూపిన గురుదేవుడవే
సచ్చరిత్ర గీతా బోధన
కార్యకారణసంబంధాలు
గురువూ నీవే దైవం నీవే
తల్లి తండ్రి సఖుడవు నీవే
మమ్ముల కాచి బ్రోవుమయా
గురుదేవా ఇవె జోతలయా
********%%%%%%%*********