నువ్వు నేనేనా?
నువ్వు నేనేనా?
అందమైన అమ్మాయి బొమ్మ
మనసు దోచుకున్నట్టు
అన్నీ పొందిగ్గా.. ఎక్కడి వక్కడే
అమర శిల్పి జక్కన శిల్పంలా
నోరూరించేలా
ముట్టుకొని మురిసిపోవాలో
హత్తుకొని ఆనందించాలో
రాత్రి పగలు
వెళ్తూ వస్తున్నప్పుడు
పరవశమైన దరహాసంతో
తృప్తిగా కళ్ళతోనే తాగేస్తూ
నా కోర్కెను పంచుకున్నా
కాంక్షకు హద్దుల్లేవు
ప్రేమకు వయసు లేదు
నన్ను చూస్తూ ఆమె కొంటె నవ్వు
నా కోసం చాపిన బాహువులు
ఆ కౌగిల్లో కరిగిపోవాలని
నాలాగే అందరూ కోరుకొంటుంటే
పెద్దవాడినే గాని పేదవాడిని
నీ ఆప్యాయతా ప్రేమలు
నాపైనే అని ఎంత నమ్మానో మరి
టుస్సాట్ మ్యూజియం మైనం బొమ్మలా
బర్త్డే బేబిలా.
ఇంటికొచ్చినచాక్లెట్ బొమ్మా
మైనంలా నాలో కరిగేది ఎప్పుడమ్మా....