ప్రకృతిలో వికృతి
ప్రకృతిలో వికృతి


(శార్దూల పద్యం)
మ్లానంబయ్యెను జీవితాస్య మెవడమ్మా!మూగజీవంబులన్
నానాహింసలు వెట్టి మ్రెక్కెనట! అన్యాయంబుగా, వీడి ధీ
జ్ఞానంబుల్- ప్రకృతిప్రకోపమె మహాసంక్షోభమ'య్యెన్ 'కరో
నా' నామైకవిషాణు జీవికి- ప్రపంచంబెల్ల కంపించెడిన్
(సీస పద్యం- తేటగీతితో)
పెండ్లి సందడి లేదు బండ్లసవ్వడి లేదు
పొంతలన్నియు నిండు
సంత లేదు
"తెరచాటు'లే 'వెండితెర' విడుదల లౌర!
'చిత్ర'సీమకును వైచిత్రి లేదు
తలమున్కలై ఫైళ్ల తలపెట్టి కడతేర్ప
తలకొక్క పనిసేయు 'కొలువు' లేదు
బడి 'బడి చక్కెర' - గుడినొంటి పూజరా!
అచ్చట్లు -ముచ్చట్లు నసలు లేవు
బోసిపోయె మైదానముల్ - చూసి చూసి
చేయరాదయ్యె కలుపుటల్ చేయిచేయి.
దిక్కుతోచక ప్రజ బిక్కుబిక్కు మనుచు
గడప సాగెను 'గడి' గీసి గడప యందు.