STORYMIRROR

VENUGOPALA RAO PHARSHY

Inspirational

4  

VENUGOPALA RAO PHARSHY

Inspirational

ధాన్యధాత - అన్నదాత

ధాన్యధాత - అన్నదాత

1 min
389

(కందము)

కోతకు వచ్చెడు పంటల 

వాతఘనాఘనఘనంపు వడగండ్లు పడెన్

రైతన్నల కడగండ్లయి

చేతోశల నీరుకార్చి ఛిన్నముచేసెన్


(కందము)

అతివృష్టి కనావృష్టికి

నతలాకుతలంబవుౘును నతులితరీతిన్

వెతలను సహించివైౘుౘు

క్షితిమాతను వీడవే! కృషీవల! నీవున్


(కందము)

కర్షకగణహర్షదమగు

వర్షముపడ బ్రతుకుపండు వర్షాంతమునన్‌

వర్షముపడకున్కిని సం

ఘర్షణమున బ్రతుకులల్లకల్లోలమగున్


(సీసము- తేటగీతితో)

అర్థశబ్దాఖ్యలౌ నయ్యలంకృతులుగాన్

      విక్రాంతదోర్దండవృషభయుగళి


నవభావనముగాఁగ నాగటిౘాలుగా 

    సరససాహితిగాఁగ ధరణితలము


ఛందోనియతిరేఖలందునంబడఁగ న

      క్షరరాశి యనెడు బీజతతి ౘల్లి


సుకవితాయుతకృతి ప్రకటింౘు రీతిగాఁ

        బండించి పచ్చౕని పైరు పంట


రసికజనులకుఁదనివితీరంగఁజేయుఁ

గృషకకవివైతివౌర! ప్రకృతినిఁగృషిని

ధాన్యధాత సుమీ! యన్నదాత! నీవు

ధన్యయైనది కని నిన్ను తల్లిపుడమి



Rate this content
Log in

Similar telugu poem from Inspirational