STORYMIRROR

VENUGOPALA RAO PHARSHY

Classics

4  

VENUGOPALA RAO PHARSHY

Classics

పద్య కవిత్వం

పద్య కవిత్వం

1 min
501

( సీస పద్యము, తేటగీతితో)


కరకజ్జములు కజ్జికాయలు బజ్జీలు 

 సొజ్జప్పములును మైసూరుపాకు


పులిహోర పూతరేకులు పాయసమ్ము పూ

   రీపాయసమ్ము బర్ఫీ పకోడి


వడలునావడలును వడియమ్ములును గారె 

లప్పమ్ములును బూరెలప్పడములు 


బొబ్బట్లు పెసరట్లు బూందిలడ్డులు హయ

    గ్రీవమ్మరిసెలు జాంగ్రీ జిలేబి


జంతికలు బాదుషాలు కాజా   పుణుకులు


కట్టెపొంగలి చక్రపొంగలి మురుకులు


రవ్వకేసరి బోండముల్ గవ్వలు పర


మాన్నమును పాలకోవా యివన్ని యెన్న


( తేటగీతి)


భాగవతభారతాది కావ్యములు వెలయు

నాంధ్రసాహితీగృహమందు నక్షయరుచి

పాకరసహృద్యములయిన పద్యములయి 

పరిఢవిల్లెను సుకవిత్వ పాకశాల



Rate this content
Log in

Similar telugu poem from Classics