STORYMIRROR

VENUGOPALA RAO PHARSHY

Classics

4  

VENUGOPALA RAO PHARSHY

Classics

జనగణమన...(మూలం: టాగూర్)

జనగణమన...(మూలం: టాగూర్)

1 min
331

(తేట గీతి)


జనగణమనోధినాయకా! జయములగుత!


భరతదేశసౌభాగ్యభాస్వద్విధాత!


ద్రావిడోత్కళగుజరాన్మరాఠవంగ 


సింధుపంజాబు మున్నగు సీమలన్ని


(తేటగీతి)


హైమవింధ్యాచలమ్ములు యమున గంగ


రంగదుత్తుంగకంధితరంగతతులు


నీదు శుభనామగుణగాననిర్భరములు 


నీ శుభాశీఃపరంపరల్నిరతమడుగు 



(తేటగీతి)


నీదు విజయగాథల నహర్నిశము పాడు 


జనగణసుమంగళప్రదా! జయములగుత!


భరతదేశసౌభాగ్యభాస్వద్విధాత!


జయములగుఃగాత! యగుఃగాత! జయము జయము


Rate this content
Log in

Similar telugu poem from Classics