STORYMIRROR

VENUGOPALA RAO PHARSHY

Classics

4  

VENUGOPALA RAO PHARSHY

Classics

ఉగాది

ఉగాది

1 min
395

(ఉత్పలమాల పద్యం)


చేకుఱుగాత! యెల్లరకు క్షేమము, సౌఖ్యము; చిత్తకోకిల 


శ్రీక కుహూ కుహూరవళిచే మదిమావి చిగుర్చు గాత! పు


ష్పాకరు స్వాగతించె మధుపావళి ఝుంకృతి దుందుభిధ్వనిం 


జీకటి పెందెరల్తొలగజేసె నుగాది ప్రభాతదీఫ్తితోన్


(కంద పద్యం)


శుభకృత్సంవత్సరమున 


శుభకామనలివియె విభవశోభాయుతమై 


ప్రభవించుచున్న తేజః 


ప్రభలన్ ప్రజ ప్రగతిపథము పట్టి యడుగిడున్





Rate this content
Log in

Similar telugu poem from Classics