నా పల్లె గేయం
నా పల్లె గేయం


✓అమ్మ చేతి గోరు ముద్దల కమ్మదనాలు
మాతృ భాష పదజాల తియ్యదనాలు...
✓పసిపిల్లలు వేసే తప్పటడుగులు
పెద్దవారు నేర్పే నడవడికలు...
✓పొరుగింటి చక్కటి పలకరింపులు
పల్లెటూరి ప్రకృతి పులకరింపులు...
✓వేకువజామున మెల్కోపే కోవెల సుప్రభాతాలు
నిశీథవేళలో నిద్రపుచ్చే చల్లటి చిరుగాలులు...
✓పాడిపంటలతో అనునిత్యం తళతళలాడే
పల్లెలు
పండుగలకు బంధువులతో కళకళలాడే
ఇళ్లులు...