STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

" Dear comrade !"

" Dear comrade !"

1 min
12


Dear Comrade...
అలసిపోతున్నావా!

బాధ్యతలు భరించడంలో,
భావోద్వేగాలు మోయడంలో,
ప్రణాళికలు రచించడంలో,
పరిస్థితులతో ప్రయాణించడంలో...

Dear Comrade...
అలసిపోతున్నావా!

బంధువులను పెంచుకోవడంలో,
బంధాలను నిలుపుకోవడంలో,
మనుషులను కూడగట్టడంలో,
మనసులను ఆకట్టుకోవడంలో...

Dear Comrade...
అలసిపోతున్నావా!

ఆశలను పుట్టించడంలో,
కలల్ని నెరవేర్చుకోవడంలో,
అంచనాలను అందుకోవడంలో,
లక్ష్యాన్ని చేధించడంలో...

Dear Comrade...
అలసిపోతున్నావా!

స్వార్ధం రాజ్యమేలుతున్న ఈ సమాజంలో,
ధర్మయుద్ధమే చేస్తున్నా —
పోరాడుతూ అలసిపోతున్నావా...?

అలసి... అలసి...
అణుచుకోలేని ఆ ఆవేదన,
ఆపుకోలేని ఓ క్రోధమై బయటపడితే —
అడ్డుపడలేక,
మళ్ళీ... మళ్ళీ... అలసిపోతున్నావా...?

Written
By
Satya Pavan 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract