STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"మార్పు !"

"మార్పు !"

1 min
17




అనగనగా...
 సాఫీగా సాగిపోతున్న జీవితంలో
అనుకోకుండా ఆగిపోయిన కథ అది...

ఆ కథే
చెదిరిన కలై,
ఓ వ్యధై,
చెదరని జ్ఞాపకమై
మనసు మూలల్లో మిగిలి
మౌనంగా మనతోనే మాటలాడుతుంటుంది...

కొన్నిసార్లు నవ్వులై
మనసుని తేలికపరుస్తుంది,
ఇంకొన్నిసార్లు కన్నీళ్లై
అదే మనసును తడిపేస్తుంది...

మర్చిపోవాలని అనుకున్నా
మరచిపోలేని గుర్తులై,
మార్చలేని రాతలై
అడుగడుగునా వెంటాడుతూనే ఉంటుంది...

జీవితం ముందుకు సాగుతున్నా
జ్ఞాపకాలతో కూడిన ఆ గతం మాత్రం
మనసుని కదల్చకుండా ఒక చోటే నిలిపేస్తుంది...

అందుకే ఆ మనసుని
మార్పు అనే ఆయుధంతో
ఎప్పుడైనా ఒకసారి కదిపి చూడు...

ఎందుకంటే—
మార్పు మొదలైతే గతం బంధం కాదు,
ఓ పాఠంగా మారుతుంది...
 ఆ పాఠమే భవిష్యత్తుకి బలమవుతుంది!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract