STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"నిజమేనేమో?"

"నిజమేనేమో?"

1 min
19



నిజమేనేమో…
నిజాయితీగా నడిచే అడుగుల కంటే
మోసం చేసే మార్గాలకే జనాల చప్పట్లు కొడతారేమో…

నిజమేనేమో...
మనసు నిండా ప్రేమ దాచుకునే వారి కంటే
మాటల్లో మసి పూసే వాళ్ళనే మనిషిగా కొలుస్తారేమో

నిజమేనేమో…
నమ్మకాన్ని నికరంగా నిలబెట్టే వాళ్ళ కంటే
అవసరాలకి అమ్మకంగా తాకట్టు పెట్టేవాళ్ళే తెలివైనవాళ్ళేమో

నిజమేనేమో…
బాధ్యతలనొదిలేసి బోకులా తిరిగే వాళ్ళనే 
కుటుంబాలు కాపాడుకుంటాయేమో…

నిజమేనేమో...
నోటితో నిజం మాట్లాడే వారి కంటే
మొహంతో నటన చేసే వారే నచ్చుతారేమో...

నిజమేనేమో…
ఎంతో కొంత లోపం లేకుండా...
మరీ ఇంత ముక్కుసూటిగా ఉంటే
అందరికీ దూరమవుతామేమో…

ఎందుకంటే…
రాముడు దేవుడంటూ పూజిస్తూనే,
రావణుడి మార్గాన్నే అనుసరించే ఈ జనం…

24 క్యారెట్ల నాణ్యత గల బంగారం కంటే,
22 క్యారెట్ల లోపమున్న బంగారానికే
ఎక్కువ విలువనిస్తారు కాబట్టి…

@mr.satya's_writings✍️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract