*బతుకమ్మ విశిష్టత*
*బతుకమ్మ విశిష్టత*
బతుకమ్మ పండుగ వచ్చింది,
తెలంగాణకు కొత్తదనం తెచ్చింది,
అక్కాచెల్లెళ్ల ఆటలు ,
పల్లెల్లో సరదాలు,
చల్లని గౌరమ్మ వి నీవు,
ప్రకృతిమాత వై కొలువై ఉన్నావు
వరాలు ఎన్నో అందించి నావు
ఆనందాల హరివిల్లువు నీవు ,
బతుకమ్మ బతుకమ్మ అన్ని పాటలు పాడించి నావు,
తంగేడు పువ్వు ల వనాలు,
పసుపు కుంకుమలతో పూజలు,
పట్టుచీరతో ఆడపడుచులు,
ఆహ్లాదంగా చేసుకునే ఉత్సవాలు,
ఇంటింటా చేరిన సిరిసంపదలు,
మరువలేని జ్ఞాపకాలు,
సంద్రం లా వచ్చే జనాలు,
ఇవే మా బతుకమ్మ శుభ దినాలు.