" ఆ నలుగురు"
" ఆ నలుగురు"
నలుగురిలో బ్రతికేటప్పుడు...
నలుగురితో బ్రతికేటప్పుడు...
నలుగురికి నచ్చేలా బ్రతకాలనుకుంటే,
నలుగురు మెచ్చేలా ఉండాలనుకుంటే...
కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవాలి...
దానికి తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాలి.
లేదంటే...
ఆ నలుగురిలో కానివాడిలా
ఒంటరిగా మిగిలిపోతాం.
కానీ...
అలా మారుతూనే ఉంటే...
ఏదో ఒక రోజు...
మనల్ని మనమే కోల్పోతాం!
