STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

నువ్వు మగాడివి బ్రో...

నువ్వు మగాడివి బ్రో...

1 min
14

నువ్వు మగాడివి బ్రో...
నీ కళలు పక్కన పెట్టాలి
ఇంట్లో వాళ్ల కలలు నెరవేర్చాలి
మనసులో నొప్పులు మొయ్యాలి...
ముఖంపై నవ్వే చిందించాలి.

నువ్వు మగాడివి బ్రో...
గెలిచినప్పుడు తగ్గిపోవాలి
పడినప్పుడు తట్టుకోవాలి
బాధ్యతలకు బానిసవ్వాలి
భవిష్యతుకి భారమవ్వాలి

నువ్వు మగాడివి బ్రో...
ఊర్లోనే ఉపాధి వెతికితే చేతకానోడివి
ఉపాధికై ఊరు దాటితే స్వార్ధపరుడువి
సమాజం కోసం సంపాదించాలి
ప్రపంచం కోసం సాధించాలి.

నువ్వు మగాడివి బ్రో...
స్త్రీల సమానత్వం కోసం పోరాడాలి
ఆ స్త్రీలే వివక్ష చూపితే సర్దుకుపోవాలి.
నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు మార్చుకోవాలి
ఇతరుల కోసం నిరంతరం బ్రతకుతూ నిన్ను నువ్వే మర్చిపోవాలి.

నువ్వు మగాడివి బ్రో...
నీ బాధను నీ నీడకే చెప్పుకోవాలి
నీ బలం మాత్రం ఈ ప్రపంచానికి చూపాలి
కుటుంబం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలి.
చివరికి ఎన్ని చేసినా "ఏం చేసావ్ ?" అన్న మాటకు మౌనంగా మిగిలిపోవాలి

నువ్వు మగాడివి బ్రో...
నీ కన్నీళ్ళు నిజమైనవే కానీ,
ఆడపిల్లలా ఆ ఏడుపేంటి ?
నీ కష్టం విలువైనదే కానీ,
చిన్నపిల్లాడిలా పైకి చెప్పడమేంటి ?
 
ఎందుకంటే,
నువ్వు ...
మగాడివి బ్రో...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract