STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"ఎవరు నువ్వు ?"

"ఎవరు నువ్వు ?"

1 min
3


ఎవరు నువ్వు ?
ఒకప్పుడు బడిలో చివరి గంటతో ఇంటికి పరుగుతీసిన నువ్వేనా..?
ఇప్పుడు గుండెలో మోగుతున్న నిశ్శబ్ద శబ్దానికి బానిస అయ్యింది.

 ఎవరు నువ్వు ?
ఒకప్పుడు ఎక్కువ మార్కుల కోసం నిరంతరం పోటీపడిన నువ్వేనా ?
ఇప్పుడు సంపాదన తక్కువయిందని మాటలు పడుతుంది.

ఎవరు నువ్వు ?
ఒకప్పుడు చిన్న దెబ్బకే వెక్కి వెక్కి ఏడ్చిన నువ్వేనా ? ఇప్పుడు మనసు ముక్కలైనా చిరునవ్వుతో సర్దుకుపోతుంది.

ఎవరు నువ్వు ?
ఒకప్పుడు చుట్టమంటే పట్టం కట్టిన నువ్వేనా ?
ఇప్పుడు బంధాలను బరువుగా తెంచుకుంటోంది.

ఎవరు నువ్వు ?
ఒకప్పుడు అందరి బాధలకు ఓదార్పు చెప్పిన నువ్వేనా ? ఇప్పుడు నీ బాధ తీర్చే వాళ్ళులేక కన్నీళ్లు లెక్కపెడుతుంది.
 
ఎవరు నువ్వు ?
ఒకప్పుడు చిన్న చిన్న సంతోషాలను చిల్లర పోగేసి కొనుక్కున్న నువ్వేనా ?
ఇప్పుడు పెద్ద పెద్ద ఆశల కోసం చిన్న చిన్న ఆనందాల్ని వదులుకుంటోంది…

ఎవరు నువ్వు ?
ఒకప్పుడు రేపటి కోసం కలలతో నిద్రపోయిన నువ్వేనా ? ఇప్పుడు రేపు ఎలా ఉంటుందో అన్న భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతోంది…

ఎవరు నువ్వు ?
ఒకప్పుడు ఎవరి రాక కోసం ఎదురు చూడని నువ్వేనా ? ఇప్పుడు ఎవరూ రాకపోయినా ఎదురు చూస్తున్నది…

ఎవరు నువ్వు ?
ఒకప్పుడు నిన్ను నువ్వే నమ్ముకున్న నువ్వేనా ?
ఇప్పుడు అద్దంలో కనిపించే నీ ప్రతిబింబాన్నే ప్రశ్నిస్తున్నది…
 
ఎవరు నువ్వు ?
కాలంతో పాటు మారిపోతున్నావా…?
లేక మారిపోతున్న కాలంలో ఒంటరిగా మిగిలిపోయావా…?


Rate this content
Log in

Similar telugu poem from Abstract