"ప్రయాణం !"
"ప్రయాణం !"
ప్రతీ ప్రయాణంలో
కొన్ని పరిచయాలు ఏర్పడతాయి
కొన్ని పలకరింపులు దరిచేరతాయి
పరిచయమైన, పలకరింపైన ఎప్పుడొకప్పుడు
పక్కకు తప్పుకోక తప్పదు కదా...
కొన్నిసార్లు పడిపోతాం.
కొన్నింటిని కోల్పోతాం.
లేచి నిలబడి కోలుకోలేకపోతేనే కదా...
ప్రతిసారీ ఓడిపోయేది !
సమాజం నవ్వుతుందనో ?
ప్రపంచం వెక్కిరించిందనో ?
అలా కదలకుండా నిలబడిపోతేనే కదా...
అడుగులు తడబడి చతికిలపడిపోయేది !
ఏ ప్రయాణమైనా.. గమ్యం చేరకుండా ఉంటుందా ?
గెలుపు తలుపులు తెరుచుకోవడం కాస్త ఆలస్యమైతే,
మరణమే నీ ప్రయాణానికి అసలైన గమ్యమని నిర్ణయించుకుంటే అసలీ ఈ ప్రయాణానికి అర్థమంటూ ఉంటుందా ?
వేసవి కాలంలో
ఈ సాయంకాలపు రాతలే...
గడిచిన కాలం
నిశబ్దంగా వదిలిన
నా కలపు తలపులు...
@mr.satya's_writings✍️
