మార్మిక నది
మార్మిక నది


మార్మిక నది
జీవిత తత్వం తెలియనప్పుడు
కవిత్వం తో పని ఏముంది ?
ఆశల నౌకలు కల్లోల కడలి లో
కొట్టుకు పోయేటప్పుడు
చింతా లేక చింతనా
ఏది కావాలి ?
కాన రాని లోకాలు
చీకటి కానల లోకి
తరుముతుంటే
పెంజీకటి అవ్వల
వెలిగే ఆకృతికి వెదికే
మనిషి ఒంటరి సైనికుడా ?
సత్యమో ,సౌందర్యమో
అన్వేషణ మొదలు కాక
ముందే
దేహం రాలి పోతే
మోహపు జీవితానికి
అర్ధమేముంది ?
ఇప్పుడు జీవితం నా
గది లో
ప్రవహించే
మార్మిక నది !