మళ్ళీ మా ఊరు
మళ్ళీ మా ఊరు
మా ఉరి 'గంగ'
చెరువు లో మునిగి
రెండు కలువల్ని తీసుకుని
గట్టుకు వస్తే
ఆత్మ శుద్ధమైంది !
మా ఊరి
బడి ప్రాంతం లో సంచరిస్తుంటే
పలకల జ్ఞాపకాలు
మనోఫలకం
లో చెల రేగి పోయాయి !
ఆ ఎద్దుల బండి ని
తడిమితే
తన కడుపు లో
దాచుకున్న
నిండు గర్భిణీ
స్రావమైన
జీవపు&n
bsp;మరక
గరుకు గా తగులుతోంది !
అప్పడు నవ్వుల తో
చరించిన
పెంకుటిల్లు
ఇప్పుడు నాగ జెముడు తో
నవ్వింది !
బంధాల తో పరిమళించిన
ఇల్లు
పుట్టలు పోసి
పాముల కు నెలవయ్యింది !
సాయంత్రం ఎర్ర బస్సు
సంజ ధూళి రేపుతూ
వస్తుంది !
దృశ్యం దూరమవుతుంటే
జ్ఞాపకం చిక్కనవుతోంది !
- వీరేశ్వర రావు మూల