సప్తవర్ణాలు
సప్తవర్ణాలు

1 min

415
నా పక్కన నువ్వుంటే చాలు...!!
అంబరమంతా సంబరంలా విలసిల్లిపోతుంది...!
మేఘం మణి మాణిక్యమై వెలుగుతుంది...!!
చెదిరిపోయిన స్వప్నం కూడా తిరిగి రూపొందుతుంది...!!
వసంతం వర్షించి కోకిల గానాలతో తీయని స్వర రాగాలతో వినిపిస్తుంది...!!
నా హృదయ వీణలోని మౌన తరంగాలు కదలి మధుర రాగాలు ఆలపిస్తుంది...!!
నీ నవ్వుతో సంతోషం సగం బలంలా అనిపిస్తుంది...!!
నీ ప్రేమ లాలాపనలో అధరాలు ఎరుపెక్కి చెక్కిళ్ళు సిగ్గుతో ఉన్నట్టుంది...!!
నా సాయంత్రపు సామ్రాజ్యం సప్తవర్ణాలతో నిండిపోతుంది...!!