పసి మనసు
పసి మనసు
కోపం చూపిస్తే దూరం దూరం అంటుంది
అక్కున చేర్చుకుంటే కలిసిపోతుంది
తప్పులని ఒప్పులుగా మార్చుకుంటే
పోనీ అలాంటి అవకాశమైనా ఇస్తే
నిన్ను హత్తుకుపోతుంది
ఇదంతా నా గోస మాత్రమేనా
నీకు అర్థం అవుతుందా
లేకుంటే నేనే కలలు కంటున్నానా
కలయో నిజమో వైష్ణవ మాయో అని పాటలు పాడుతున్నానా
అంతేలే
నీ కన్ను నా పెదాల మీద నవ్వును చూడగలదు
నా మనస్సులోని భావాల్ని చదవలేదుగా
అవమానించు
అసహ్యించుకో
ఏదో రకంగా నీతో ఉండాలనే తాపత్రయం
కనీసం ఒక చేదు జ్ఞాపకంగా అయినా ఉంటా
నిన్ను ప్రేమిస్తూ
నీ ఆనందం కోసం ప్రార్థిస్తూ జీవించే పసి మనసిది నేస్తం!
