STORYMIRROR

# Suryakiran #

Abstract

4  

# Suryakiran #

Abstract

చూడాలని ఉంది !

చూడాలని ఉంది !

1 min
319

నా ఆశ , ప్రపంచమంతా ...


చిన్నారులు చిరునవ్వులు చిందించాలని ...

గడ్డిపరకలు మంచుబిందువులతో మెరిసినట్లు ...


బాలలు ఆటపాటలతో సమయాన్ని గడపాలని ...

పక్షులు స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరినట్లు ...


యువత ఉన్నతంగా చదువులతో ఎదగాలని ...

అడవుల్లో వృక్షాలు గుబురుగా పెరిగినట్లు ...


కార్మికులు శ్రమలోనూ సౌందర్యాన్ని చూడాలని ...

తేనెటీగలు సులువుగా మధువును సేకరించినట్లు ...


ప్రేమికులు కలకాలం కలసిమెలిసి ఉండాలని ...

చిలుకలు గోరింకలు ఎక్కడున్నా మురిపించినట్లు ...


ప్రజలందరు భోగభాగ్యాలతో విలసిల్లాలని ...

నదులు ఆనకట్టలను దాటి ప్రవహించినట్లు ...


మరల మరల చూడాలని ఉంది ఆ రోజును ,

మనిషిలో నిలువెల్లా ప్రకాశించే రారాజును .



Rate this content
Log in

Similar telugu poem from Abstract