అందమైన దారులు
అందమైన దారులు


ఎప్పుడూ అద్భుతం మనిషి జీవనం .
విజయసాధనలో ఆ తియ్యదనం .
అరుదుగా కనిపించే మానవనిర్మిత కట్టడం ,
అసాధారణ ప్రతిభను ప్రతిబింబించే జీవితం
చెప్పుకోదగిన ఉదాహరణలు .
అబ్బురపడే సహజ గుణంతో
నిజంచేసి చూపాలనే తపన
ఆ కలిగే ప్రేరణలోని ముఖ్య ఆకర్షణ .
గమనాన్ని గాలికి ఒదిలేసి ,
అది తెగిన గాలిపటమని అనేసి ,
గమ్యా
నికి సమయానికి
చేరకపోతే వైఫల్యమనే !
తన శక్తిని నమ్ముకుని ,
ఒడిదుడుకులను ఏమైనా తట్టుకుని ,
పట్టుదలతో దూరాలైనా పయనించి
దృక్పథంలో గెలుపును ఆహ్వానిస్తే ,
ఉన్నతశిఖరాలను అలవోకగా అధిరోహిస్తే
తనపని తాను చేశాడనే .
ప్రతిఫలం అనుకోకుండా దక్కిందనే !
అలా ఏర్పడేవే అందమైన పూలదారులు .
భావితరాలకు గొప్పవారథులు !!