చదువులు
చదువులు

1 min

297
చదువులు
ఆశ్చర్యకరంగా మనుషులకే ప్రత్యేకం .
తెలివితేటల్లో అందుకే
ఇతర జీవులతో కాలేదు వారు ఏకం !
బడులు బాల్యంలో
తీరును అలవర్చే అమ్మలాంటి ఒడులు .
వయోజనులకూ
ఉన్నత విలువలను నేర్పేవే ఆ మడులు !
చదువుల వలన
నిత్యజీవితంలో ప్రయోజనాలు అనేకం .
నిరక్షరాస్యులు
గుర్తించితే అందరూ కావచ్చు మమేకం !
విద్య ఒసగును
వినయము అని అన్నారు మన పెద్దలు .
ఐనా పొంతన లేకనే
సమాజంలో దుర్జనులు అనబడే గ్రద్దలు !
మంచి పరిశోధనతో
ఉండాలి చదువులు మార్చేలా బతుకులు .
లేదంటే అవి ఎన్నటికీ
దారిలో నడకను జటిలం చేసే గతుకులు !