గవాక్షం
గవాక్షం


మనిషి దేహానికి కన్నులాంటిది
ఇంటికి కిటికీ .
తపాలా కార్యాలయమూ అంతే
పెద్దదైనా సిటీకి .
దృశ్యమాలికలుగా ఆ కనిపించే
సంఘటన్నీ మెదడుకి .
ప్రత్యక్ష సాక్ష్యాలుగా చుట్టూ ఉన్న
పరిసరాలన్నీ వార్తావిశేషాలకి .
రోజూ ఇంటితలుపులను తెరచుకుని
రాకపోకలు సాగించేవారు
కిటికీలవద్దా గడుపుతారు కాసేపు .
అందమైన అనుభూతులను పొందటం
వారి దినచర్యలో ఒక భాగం .
పచ్చని మొక్కలతో , పూచే పూవులతో
మూసినపుడు పొందలేని ఆహ్లాదం .<
/p>
లోపలికి ప్రవేశించే చల్లనిగాలి
అణువణువును పులకింపజేస్తూ అమోఘం .
వెలుతురు సహజంగా లభ్యమయ్యే శక్తిని
అందించి చేస్తూ తేజోమయం .
ఆ కిటికీలు ఇరుగుపొరుగున ఉన్న ఇళ్ళతో
తమ ఉనికిని తెలిపి అనుసంధానమై ...
అలా మంచి సంబంధాలకు అవి ఒకేలా
ప్రతిఊరులో ఏనాటికీ కారణమై ...
చరవాణిలో నేడు సమాచారాలు
సాధారణమైనా , అతని ఎదురుచూపులు
తాత ప్రేమగా వ్రాసే ఉత్తరానికై ..!
వంశపారంపర్యంగా అందే సంస్కృతిని
అక్షరాలలో వారసుడిగా తెలుసుకొనుటకై ..!