కలసి ఉండాలంటే ..!
కలసి ఉండాలంటే ..!


కలసి ఎప్పుడూ ఉండాలంటే ,
ఆ ఆశయం మనలో బలంగా ఉండాలి .
జ్ఞానమే అందుకు
తగిన ఆలోచనను మనసులో కల్గించాలి !
పరిచయంలో ,
మనిషికి సాటిమనిషి అనే మమకారం .
తద్వారా అందునెంతో సహకారం !
అదీ లేకుంటే , పుట్టుకకు అర్థమేదీ !
ఒకరినుంచి మరొకరికి ఉపకారమేముంది ?
స్నేహంలో ఒంటరితనం కనుమరుగు .
ఈదురుగాలి వంటి అపోహలు తొలగి ,
p>
నైతికస్థైర్యం చీకట్లోని దీపమగు .
శ్రీకృష్ణుడు కుచేలుడు , శ్రీరాముడు సుగ్రీవుడు
అని అబ్బురపరచే ఆ మాధుర్యం
భవిష్యత్ తరాలకెపుడూ ప్రేరణగు .
ప్రేమ మానవజాతి మనుగడకే ఆధారం ;
నిజంగా మేలు చేసే తనయొక్క స్వభావం ,
ఆనందాన్ని నింపగల మకరందం .
వర్ణిస్తూ ఎన్ని పేజీలు వ్రాసినా తరగనిదే ,
అనుభవించని జన్మ హృదయంలేని
గృహోపకరణం అనిపించే ఓ బండరాయే !