నిగ్గదీసి అడుగు
నిగ్గదీసి అడుగు


నిగ్గదీసి అడుగు
ఈ సిగ్గు లేని జనాన్ని
అని అన్నాడో సినీ కవి
జరుగుతున్నది తప్పని చెప్పలేని
నాలాంటి మధ్య తరగతి మనిషిని
నాలోని దిగువ మధ్య తరగతి మనిషి
ఏమని నిగ్గదీసి అడగాలి
నిజం మాట్లాడకుండా
జీవచ్ఛవంలా బ్రతకడమే
పోకడ అయిన సమయం
నేనెవరిని నిగ్గదీయాలి
స్వాతంత్ర్యము విలువ
చేసే నేరాల్లో వెతుక్కునే వారిలో
ఎవరి వ్యసనాలు వారివి
అని తేలిగ్గా మాట దాటేసే
మనుషుల అజమాయిషీలో
నిజమైన స్వాతంత్ర్యం
నీటి మీద రాతలా మారిపోకుండా
ఎప్పుడు స్వేచ్ఛ
ఇతరుల హక్కులను కాలరాయకుండా
ఈ సమాజం ప్రవర్తిస్తుందో
అప్పుడే స్వేచ్ఛా భారతానికి
నిజమైన గౌరవం
దాని కోసం
నిగ్గదీసి అడగాలి అంటే
ప్రయత్నించడంలో తప్పు లేదేమో