నీకు నువ్వే మొలకెత్తు...
నీకు నువ్వే మొలకెత్తు...
నీ ఆశ మొలకెత్తాలి....
నీ తపన మొలకెత్తాలి....
నీ హృదయ తడి మొలకెత్తాలి....
నీకు నువ్వే నవీన ప్రకృతిగా మొలకెత్తాలి....
నీ పని మొలకెత్తాలి....
నీ ప్రతిధ్వని మొలకెత్తాలి....
నీ సంకల్పం మొలకెత్తాలి....
నీకు నువ్వే ప్రయత్నపు మట్టికింద గింజై మొలకెత్తాలి....
నీకు నువ్వే మధురపరిమళ మట్టివి...
నీకు నువ్వే తడిమడిలో ఆకులు తొడిగే మొగ్గవి...
నీకు నువ్వే గెలుపు మొక్కవి...
నీకు నువ్వే అలుపెరుగని ప్రయాణానివి...
నిను తాకిన అవమానం నిను చెక్కే శిల్పం...
నిను చేరిన చింత నిను చరిత్రకు ఎక్కించే మార్గం...
నిను కలుకున్న ప్రతీ కష్టం నీ ఇష్టాలకు చేరువ చేసే స్వప్నం...
నీ మనసు మగాణంలో
నీకు నువ్వే మానవత్వపు మొక్కై...
దయ కరుణా దిక్కై...
ప్రేమ ప్రవాహ పరిమళ గలగలలా సవ్వడై
కొత్తగా మొలకెత్తు...
*అపుడే నీ జీవితం ప్రతి తరానికి ఔతుంది ఆదర్శపు విత్తు...*

