STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

చివరిక్షణం

చివరిక్షణం

1 min
2


జీవితానికి చివరి క్షణం ఒక్కటే అయినా
జీవితంలో చివరి క్షణాల ఘటనలు ఎన్నెన్నో
గమ్యం చేరాల్సిన వాహనం ఎక్కడానికి
గడువు దగ్గర పడుతుంటే ఆతురత
అందుకోలేకపోతే అన్నదే ఆరాటం

ఎందరినో కలవాలనుకుంటాం
సమయం కలిసి రానప్పుడు నిరాశ, నిస్పృహ
ఎందరితోనో మాట్లాడాలనుకుంటాం
మళ్లీ మళ్లీ కలిపినా ఫోన్ కలవకపోతే చిరాకు
కొందరిని కలిసి, సాన్నిహిత్యం ఒలకబోసి
మమతల మట్టిలో స్నేహం మొలకేయాలనుకుంటాం
అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లినా వారు లేకపోతే
ఆవరిస్తుంది ఉసూరుమన్న నిస్సత్తువ
ఆ చివరి క్షణాలు అంతే

ఈ క్షణమే చివరిదని తెలిస్తే బతుకు అర్థం మార్చలేం 
మార్గదర్శనం చేయలేం మంచికి
చూపు మలిగేలోపే, శ్వాస ఆడేటప్పుడే
చేయాలనుకున్నది చేసేయాలి నిస్సంకోచంగా

బతుకు చివరి క్షణం దాటాక
తగలేసే కట్టెపుల్లలా మిగలాల్సిందే
అప్పటిదాకా ఉన్న అహం, ఆనందం, కోపం, ప్రేమ ఆప్యాయత అన్నీ ఆరిపోయిన దీపాలే
చివరి క్షణానికున్న విలువ చెప్పగలరా ఎవరైనా

ప్రతిక్షణం చివరిదనుకుని మెసిలితే
చేసుకుంటాం సద్వినియోగం సమయాన్ని 
అందరికీ కాకున్నా నచ్చిన వారికైనా ఉపయోగకరం
ప్రకృతికో, సమాజానికో మారుతాం చేయూతగా


Rate this content
Log in

Similar telugu poem from Classics