ఆ సమయం
ఆ సమయం
నువ్వు ఎంత గొప్పొడివైన.
ఎంత మేధావివైన.
మరెంత గారిబువైన.
నిమిషాల మీద సంపాదించిన.
వీరుడివైన శూరుడువైన.
పదిమందిని వెంట వేసుకొని తిరిగిన.
నేటిరాజ్యం నీదైన కాకపోయినా.
పూరింట్లో ఉన్నా.
ప్యాలెస్లో ఉన్నా కాని.
రేయి పగలు రాత్రి ఒక్కటే అందరికి.
ఎన్ని వేలకోట్లు ఖర్చుచేసిన
ఎవరికోసం ఆగదు.
దానిపని అది చేసుకుంటుపోతుంది.
ఆ సమయాన్ని అపలేవు.
గడిచేరోజులకి అడ్డకట్టవేయలేవు.
ఈ ప్రపంచానికి సమయం ఒక్కటే.
అదిముందుకు కదులుకుంటు వెళ్తుంది.
