నీ కథే చర్రితగా
నీ కథే చర్రితగా
పుట్టింది ఒకసారే... చచ్చేది ఒకసారే
ఈ నడకలో ఆ కల నెరవేరే దాకా... ఆ పొద్దే నీ అడుగు
మధ్యలో ఉంది ఈ జీవితం బ్రతకాలి మనసారా
సృష్టించు ఓ అద్భుతం నీ కథే చరిత్రగా
కాలం కాదు ఎవరికీ బానిస నిలిచేది లేదు క్షణమైనా
కరిగే ముందే ప్రతి నిమిషం మలుచుకో నీకీ సాక్ష్యంగా
లోకం చూపు లెక్క కాదు నీ ఆశయమే నీకు ఆయుధం
నేల విడిచి పరుగెత్తే కలకన్నా... నేడే మొదలెట్టు నీ యుద్ధం
గుండె ధైర్యం ఉంది నీలో గుర్తు తెచ్చుకో
నీ సంకల్పం గెలిచేదాకా పోరాడు... ఓపికై పట్టుకో
నవ్వులు కన్నీళ్లు బతుకులో భాగం
రెండిటికీ నువ్వే కారణం
ఓటమి నుంచే పాఠం నేర్పు గెలుపు నీకే చేరే మార్గం
చిన్న ఆశే పెద్ద శిఖరం ఎదగాలని కోరుకో
చేతకాదనే మాటే అబద్ధం సాధ్యం కానిదంటూ ఏదీ లేదు చూసుకో
నీ లక్ష్యం నీకు తెలుసు వదిలిపెట్టకు
ఆ కిరీటం నీకు దక్కేదాకా శ్రమించు... శపధం వీడకు
సృష్టించు ఓ అద్భుతం నీ కథే చరిత్రగా
