STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

జీవితం

జీవితం

1 min
0



మరణభీతి రాల్చలేని..చదువదేమి చదువంటా..!?
మనసుగుట్టు పట్టలేని..బ్రతుకదేమి బ్రతుకంటా..!?

అడ్డమైన గోడలతో..వాదులాడు గుణమదేమి..
చీకటింటి వెలుగుకత్తి..పూని మదిని నరుకంటా..!

సంసారం ఈదలేని..సాగరమని అన్నదెవరొ..
మమకారం తొలగిపోవు..మార్గమెరిగి కదులంటా..!

చెత్తంటూ ఏమిలేదు..రేపటికది ఎఱువగునోయ్..
తెలివితోడు తేటయున్న..తెగుళ్ళన్ని చెల్లంటా..!

సౌందర్యపు రహస్యమది..వివరించే పనేలేదు..
అందమైన మాయకన్న..అందమేది లేదంటా..!

కూర్చున్నా పడుకున్నా..జరిగేనోయ్ ధ్యానమింక..
ఈ మేనే కాను నేను..గురుతున్నదె నేనంటా..!



Rate this content
Log in

Similar telugu poem from Classics