STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఏ నిమిషం..

ఏ నిమిషం..

1 min
1

ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా
సందేశం ఇస్తూ సమయం నీకేరా
ఎగిరే పక్షి నీకోసం నేలకు రాదురా
సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా
నడవాలి గెలవాలి నీ కొరకే నీవు
కాదే అనుకుంటే నీకేది బరువు
నీ విజయాలే ఓ చరిత్రలై
రేపటి తరముకు పునాదిగా..
ఎగతాలి ఎదురే పడిన, అవమానం నిన్ను ఆపినా
ఆగిపోక అడుగేస్తే కదా.. శిఖరంలా నిలిచేది నీవు
అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసట నిన్ను చేరినా
తలబడుతూ నిలబడితే కదా.. సమరంలో గెలిచేది నీవు
ప్రయత్నమే నీ తోడుంటే ఎదురేముందిరా
ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా
ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా..
నిన్ను చూసి విసిరే నవ్వులు, నిను హేళన చేసే మాటలు
ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని
నీకోసం చేసే కుట్రలు, నీ పైనే వేసే నిందలు
దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని
నీ శక్తిని మనలో నిలిపే మాటలు కావాలి
ఆ వేదిక ఉన్నది కదరా ముందుకు సాగాలి


Rate this content
Log in

Similar telugu poem from Classics