నీతోనే నేను... !
నీతోనే నేను... !
నీతోనే నేను... !
నువ్వు ప్రపంచానికి వెలుగును పంచే సూర్యునివైతే,
నీ వెలుగురేఖలో నడిచే బాటసారిని నేనవుతా...
నువ్వు చల్లని వెన్నలను పంచే చంద్రునివైతే,
ఆ వెన్నెలకు విచ్చుకునే కలువను నేనవుతా..
నువ్వు ఆకాశంలో అందమైన ఇంద్రధనుస్సువైతే,
ఆ ఇంద్రధనుస్సులోని రంగులు నేనవుతా...
నువ్వు ప్రశాంతమైన సాగరానివైతే,
ఆ సాగరంలో ఎగసే అలను నేనవుతా...
నువ్వు మకరందాన్ని అన్వేషించే తుమ్మెదవైతే,
నువ్వు అన్వేషించే మకరందాన్ని నేనవుతా...
నువ్వు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా...
నీతోనే నేను...,
నాఆలోచనలు ఉంటాయి నేస్తం... !
శ్రీ....
హృదయ స్పందన